Telugu Global
International

మైక్రోసాఫ్ట్ చేతికి 'టిక్ టాక్'?

ఇండియాలో నిషేధానికి గురైన వీడియో బేస్డ్ సోషల్ మీడియా యాప్‌ను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండో-చైనా ఘర్షణల నేపథ్యం, భారతీయుల డేటాను చైనాకు చేరవేస్తున్నదనే ఆరోపణల నడుమ కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్స్‌ను నిషేధించింది. వీటిలో బైట్ డ్యాన్స్ కంపెనీకి చెందిన టిక్ టాక్, హెలో యాప్‌లు ఉన్నాయి. తాజాగా గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో అమెరికాలో కూడా టిక్‌టాక్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టిక్‌టాక్ […]

మైక్రోసాఫ్ట్ చేతికి టిక్ టాక్?
X

ఇండియాలో నిషేధానికి గురైన వీడియో బేస్డ్ సోషల్ మీడియా యాప్‌ను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండో-చైనా ఘర్షణల నేపథ్యం, భారతీయుల డేటాను చైనాకు చేరవేస్తున్నదనే ఆరోపణల నడుమ కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్స్‌ను నిషేధించింది. వీటిలో బైట్ డ్యాన్స్ కంపెనీకి చెందిన టిక్ టాక్, హెలో యాప్‌లు ఉన్నాయి.

తాజాగా గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో అమెరికాలో కూడా టిక్‌టాక్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టిక్‌టాక్ కు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నాం… దాన్ని నిషేధించొచ్చు లేదా మరేదైనా చర్య తీసుకోవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో విలేకరుతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు భారత్, అమెరికా దేశాల్లో నిషేధంతో టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తీవ్రంగా నష్టపోతున్నది. ఆ యాప్‌కు అమెరికా తర్వాత అత్యధిక యూజర్లు ఇండియాలోనే ఉన్నారు. దీంతో తమ యాప్‌పై నిషేధం తొలగించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా మెజార్టీ వాటాను అమ్మేయాలని నిర్ణయించింది.

అయితే టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్, బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థలు కథనాలు కూడా వెలువరించాయి. అయితే దీనిపై అటు బైట్ డ్యాన్స్ ‌కానీ, ఇటు మైక్రోసాఫ్ట్ కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

First Published:  1 Aug 2020 12:10 AM GMT
Next Story