శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు శేషయ్య. ఈ క్రమంలో ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఓవైపు చికిత్స కొనసాగుతుండగానే.. హాస్పిటల్ లో ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయారు.

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ఓపెనింగ్ కు శేషయ్య హాజరయ్యారు. హీరోహీరోయిన్లు నాగచైతన్య, సాయిపల్లవిపై క్లాప్ కొట్టింది కూడా ఆయనే. ఈ కార్యక్రమం తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైన ఆయన ఇప్పుడు ఏకంగా ఈ లోకాన్నే విడిచివెళ్లారు. శేషయ్య వయసు 89 సంవత్సరాలు.