Telugu Global
NEWS

సంజయ్‌ కమిటీలో సీనియర్లకు నో చాన్స్‌ !

తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది. బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి రాకతో సీనియర్లు సైలెంట్‌ అయ్యారు. కానీ రాష్ట్ర కమిటీ ప్రకటనతో కమలంలో సైలెంట్‌ వేవ్‌ మొదలైంది. కొత్త అధ్యక్షుడిపై సీనియర్లు మండిపడుతున్నారు. సీనియర్లకు పార్టీ పదవులు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి సీనియర్లకు రాష్ట్ర కమిటీలో చోటు లేదు. బండి సంజయ్‌ వ్యతిరేక వర్గానికి అసలు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు మాత్రమే చోటు కల్పించారు. […]

సంజయ్‌ కమిటీలో సీనియర్లకు నో చాన్స్‌ !
X

తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది. బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి రాకతో సీనియర్లు సైలెంట్‌ అయ్యారు. కానీ రాష్ట్ర కమిటీ ప్రకటనతో కమలంలో సైలెంట్‌ వేవ్‌ మొదలైంది. కొత్త అధ్యక్షుడిపై సీనియర్లు మండిపడుతున్నారు. సీనియర్లకు పార్టీ పదవులు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి సీనియర్లకు రాష్ట్ర కమిటీలో చోటు లేదు. బండి సంజయ్‌ వ్యతిరేక వర్గానికి అసలు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు మాత్రమే చోటు కల్పించారు. ఈయన సంజయ్‌కు స్నేహితుడే. అయితే ఇక్కడ గుజ్జల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌ రావు లతో పాటు ఇతర సీనియర్ల బ్యాచ్‌కు పదవులు రాలేదు.

ఇక రాష్ట్ర కమిటీలో బెర్త్‌లు చూస్తే సంజయ్‌ వర్గం తర్వాత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్గానికి ఎక్కువ పదవులు వచ్చాయి. అంబర్‌పేట లేదా హైదరాబాద్‌లోని ఆయన వర్గానికి పెద్దపీట వేశారు. మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ టీమ్‌ను అసలు పట్టించుకోలేదు.

ఉపాధ్యక్షుల్లో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేలే. అధికార ప్రతినిధులుగా కేవలం ముగ్గురికి మాత్రమే చోటు కల్పించారు. కృష్ణసాగర్‌రావు, రజనీ కుమారి, రాకేష్‌రెడ్డి లను మాత్రమే అధికార ప్రతినిధులుగా నియమించారు.

లక్ష్మణ్‌ టైమ్‌లో వెలుగు వెలిగిన వారిని ఈ సారి పక్కన పెట్టేశారు. మొత్తానికి బండి సంజయ్‌ రాష్ట్ర కమిటీలో తన మార్క్‌ను చూపించారు. కానీ కరోనా కాలంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంజయ్‌… ఇప్పటి వరకూ ప్రజాసమస్యలకు సంబంధించి ఒక్క అంశంపై కూడా ఫోకస్‌ పెట్టలేదు. కేవలం మీడియా అటెన్షన్‌ కార్యక్రమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

First Published:  2 Aug 2020 6:55 AM GMT
Next Story