మూడేళ్ల నాటి సినిమాకు మోక్షం దక్కేనా!

ఆల్రెడీ చేతిలో 2 సినిమాలున్నాయి. అవి ఎప్పుడు సెట్స్ పైకొస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ ముచ్చటగా మూడో సినిమా ప్రకటించి షాక్ కు గురిచేశాడు నిఖిల్. అవును.. ఈమధ్య నిఖిల్ తన 20వ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రకటనైతే వచ్చింది కానీ ఆ మూవీ డైరక్టర్ ఎవరు… కథ ఏంటి లాంటి వివరాలు మాత్రం బయటకు రాలేదు.

నిఖిల్ వద్ద ఓ స్టోరీ ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉంది. అదొక సైన్స్ ఫిక్షన్ సినిమా. రోబో చుట్టూ తిరిగే కథ. ఆ స్టోరీ నిఖిల్ కు బాగా నచ్చింది. అందుకే మూడేళ్ల నుంచి మరో హీరో వద్దకు పంపించకుండా.. ఆ స్టోరీని, ఆ దర్శకుడ్ని తన వద్దే లాక్ చేశాడు ఈ హీరో. ఇప్పుడీ ప్రాజెక్టునే నిఖిల్ తన ప్రతిష్టాత్మక 20వ సినిమాగా మలిచే ప్రయత్నాల్లో ఉన్నాడంటున్నారు చాలామంది.

అయితే దీనిపై క్లారిటీ రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఎందుకంటే, నిఖిల్ చేతిలో ఇప్పుడు 18 పేజెస్ అనే సినిమా ఉంది. ముందుగా అది పూర్తిచేయాలి. దాంతో పాటు కార్తికేయ-2 సినిమా కూడా కంప్లీట్ చేయాలి. ఆ తర్వాతే తన 20వ సినిమాపై నిఖిల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.