బన్నీ-ఎన్టీఆర్… ఎవరి కథలు వాళ్లవే

అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై కొరటాల ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఆచార్య మూవీ కంప్లీట్ అయిన వెంటనే బన్నీతో సినిమా స్టార్ట్ అవుతుంది.

అంతా బాగానే ఉంది కానీ బన్నీ-కొరటాల సినిమా ప్రకటన వచ్చిన వెంటనే ఓ కొత్త ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ చేయాల్సిన కథతోనే బన్నీ సినిమా చేయబోతున్నాడంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు.

లెక్కప్రకారం.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల సినిమా చేయాలి. మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా అది రావాలి. కానీ ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ సినిమాతో లాక్ అవ్వడం.. ఆ వెంటనే త్రివిక్రమ్ తో సినిమా ఉండడంతో.. కొరటాల శివ, బన్నీ వైపు షిఫ్ట్ అయ్యాయి.

అప్పుడు ఎన్టీఆర్ కు కొరటాల వినిపించిన కథతోనే, ఇప్పుడు బన్నీతో సెట్స్ పైకి వెళ్తున్నాడంటూ కథనాలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు కొరటాల వినిపించిన కథను, తారక్ కోసమే అలా ఉంచేశాడట. బన్నీతో మరో కొత్త కథతో ముందుకెళ్తున్నాడట. అదీ సంగతి.