ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్?

త్వరలోనే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు త్రివిక్రమ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.

నిజానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి సినిమా కోసం కియరా లాంటి టాప్ హీరోయిన్ ను సెలక్ట్ చేస్తే, కాల్షీట్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియరా.. ఎన్టీఆర్ సినిమాకు భవిష్యత్తులో కాల్షీట్లు కేటాయించే వెసులుబాటు ఉండకపోవచ్చు. అయితే ఆ సమస్య ఉండదంటున్నారు మేకర్స్.

ఎందుకంటే.. ప్రతి ఏటా ఓ తెలుగు సినిమా చేయాలనేది కియరా ప్లాన్ అంట. అది కూడా స్టార్ హీరోల సినిమాలు మాత్రమే. సో.. వచ్చే ఏడాదికి సంబంధించి కియరా, ఎన్టీఆర్ సినిమాకు ఎలాగోలా కాల్షీట్లు కేటాయించడం ఖాయం. అంటే.. ఆ మేరకు వచ్చే ఏడాది కియరాను మిగతా స్టార్ హీరోలు కోల్పోయినట్టే. అదన్నమాట సంగతి.

అందుకే త్రివిక్రమ్ ఇలా ముందస్తుగా కియరాతో చర్చలు షురూ చేశాడు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక కాల్షీట్ల సమస్య లేనట్టే. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాకు 2 కోట్ల రూపాయలు తీసుకుంటోంది కియరా. అటు బాలీవుడ్ లో ఆమె రెమ్యూనరేషన్ మూడున్నర కోట్లు.