Telugu Global
NEWS

అమరావతి ఉద్యమం పరిధి ఎంత...?

“నిరసనల గర్జన, మూడు రాజధానులు మాకొద్దు, అమరావతే ఏకైక రాజధాని..” అంటూ తన అనుకూల మీడియాతో టీడీపీ విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది. మూడు రాజధానుల నిర్మాణానికి ప్రజలంతా వ్యతిరేకం అన్నట్టుగా బిల్డప్ ఇస్తోంది. టీడీపీ ఎంత రెచ్చగొట్టాలని చూసినా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా నిరసనలు మొదలు కాలేదు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు మినహా.. మిగతా రాష్ట్రమంతా మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించింది. గవర్నర్ ఆమోదముద్రతో మిగతా ప్రాంతాల్లో ప్రజలతో కలసి వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే […]

అమరావతి ఉద్యమం పరిధి ఎంత...?
X

“నిరసనల గర్జన, మూడు రాజధానులు మాకొద్దు, అమరావతే ఏకైక రాజధాని..” అంటూ తన అనుకూల మీడియాతో టీడీపీ విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది.

మూడు రాజధానుల నిర్మాణానికి ప్రజలంతా వ్యతిరేకం అన్నట్టుగా బిల్డప్ ఇస్తోంది. టీడీపీ ఎంత రెచ్చగొట్టాలని చూసినా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా నిరసనలు మొదలు కాలేదు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు మినహా.. మిగతా రాష్ట్రమంతా మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించింది.

గవర్నర్ ఆమోదముద్రతో మిగతా ప్రాంతాల్లో ప్రజలతో కలసి వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే టీడీపీ మాత్రం అమరావతి ఉద్యమాన్ని ఆంధ్రా ఉద్యమంగా భారీ స్థాయిలో చూపే ప్రయత్నాలు చేస్తోంది. తన అనుకూల మీడియాతో రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే భావన కలిగించాలని తాపత్రయ పడుతోంది.

కానీ టీడీపీ అనుకున్నదొక్కటి, అయినది మరొకటి. గవర్నర్ ఆమోదముద్ర తర్వాత మరోసారి తుళ్లూరులో ఆందోళనలు చేపట్టాలని భావించినా రైతులనుంచి పెద్దగా స్పందన రాలేదట. అసెంబ్లీ ఆమోదం, గవర్నర్ రాజముద్ర పడిన తర్వాత కూడా ఇంకా తమని మోసం చేయాలని చూడటం సరికాదని కొంతమంది రైతు సంఘాల నాయకులు టీడీపీ నేతలకు మొహం మీదే చెప్పాశారట.

అయినా సరే పట్టువదలని విక్రమార్కుల్లా రైతు కుటుంబాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని జిల్లా నేతలకు పిలుపునిచ్చారు. కానీ ఎక్కడికక్కడ జిల్లాల్లో టీడీపీ నేతలు ఒంటరిగానే ప్రెస్ మీట్లు పెట్టి సర్దుకున్నారు. వారి వెంట ఎవరూ రాలేదు, ఎక్కడా నిరసనలు మొదలు కాలేదు. ఒకరకంగా రాజధాని ప్రాంతం మినహా ఇతర జిల్లాల్లోని టీడీపీ నేతలు అయిష్టంగానే అమరావతికి జై అంటున్నారు. స్థానికంగా వ్యతిరేకత వస్తోందని భయపడుతున్నారు.

కనీసం అసెంబ్లీ కూడా లేకుండా చేస్తే.. అమరావతికి నిజంగా అన్యాయం జరిగిందని భావించాలి. మూడు రాజధానులు చేసి అభివృద్ధి వికేంద్రీకరణకు బాటలు వేస్తే.. అమరావతికి వచ్చిన నష్టమేంటి, నాయకులకు వచ్చిన కష్టమేంటి? మూడు రాజధానులకు నిజంగానే టీడీపీ అడ్డుకట్ట వేసే సందర్భమే వస్తే.. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతాయి. అమరావతి ఉద్యమం పరిధి కంటే అది వందరెట్లు ఎక్కువగా ఉంటుంది.

First Published:  1 Aug 2020 9:56 PM GMT
Next Story