కొత్త దారి వెదుకుతున్న వకీల్ సాబ్

కరోనా వ్యాక్సీన్ వచ్చేంతవరకు సెట్స్ పైకి వచ్చేది లేదని పవన్ కల్యాణ్ క్లియర్ గా చెప్పేశాడు. దీంతో వకీల్ సాబ్ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. జస్ట్ 15 రోజులు షూట్ చేస్తే సినిమా కంప్లీట్ అయిపోతుంది. కానీ పవన్ మాత్రం తనతో పాటు ఇతర యూనిట్ సభ్యుల జీవితాల్ని రిస్క్ లో పెట్టడం ఇష్టంలేక ఇలా కీలక నిర్ణయం తీసుకున్నాడు.

అయితే పవన్ ససేమిరా అన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు మాత్రం వకీల్ సాబ్ ను సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించాడు. ఈ మేరకు కొత్త ప్లానింగ్ రెడీ అయింది. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ ను సెప్టెంబర్ లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇందులో పవన్ కల్యాణ్ జాయిన్ అవ్వడు. పవన్ తో సంబంధం లేని సన్నివేశాల్ని సెప్టెంబర్ లో పూర్తిచేయాలని అనుకుంటున్నారు.

ఇక పవన్ తో లింక్ ఉన్న సన్నివేశాల్ని అక్టోబర్ లో ప్లాన్ చేస్తున్నారు. అప్పటికి కరోనా తగ్గుముఖం పడుతుందని, వ్యాక్సీన్ కూడా అందుబాటులోకి వస్తుందని దిల్ రాజు భావిస్తున్నాడు. సో.. అక్టోబర్ లో పవన్-శృతిహాసన్ మధ్య ఫ్యామిలీ ఎపిసోడ్ కు సంబంధించిన సీన్స్ పూర్తిచేయాలని భావిస్తున్నాడు.

ప్రస్తుతం దిల్ రాజు అనుకుంటున్నట్టు సెప్టెంబర్-అక్టోబర్ లో ఈ రెండు షెడ్యూల్స్ పూర్తయితే.. వకీల్ సాబ్ సంక్రాంతికి రావడం గ్యారెంటీ. ఇప్పుడంతా పవన్ చేతిలోనే ఉంది.