Telugu Global
National

వైసీపీకి 48గంటలు డెడ్ లైన్ విధించిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడికి పూర్తిగా మతి భ్రమించినట్టు అర్థమైపోతోంది. అమరావతి కల చెదిరిపోవడంతో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు బాబు. తాజాగా ఆయన ప్రసంగం వింటే బాబు విచక్షణ ఏ స్థాయిలో కోల్పోయారో తెలుస్తుంది. గతంలో వైసీపీ నేతల్ని రాజీనామా చేయాలని, మూడు రాజధానుల్ని అజెండాగా పెట్టుకుని తిరిగి పోటీ చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా వైసీపీ ప్రభుత్వానికి 48గంటలు డెడ్ లైన్ పెట్టారు. అసలు డెడ్ లైన్ పెట్టడానికి, రాజీనామాలు డిమాండ్ చేయడానికి చంద్రబాబు […]

వైసీపీకి 48గంటలు డెడ్ లైన్ విధించిన చంద్రబాబు
X

చంద్రబాబు నాయుడికి పూర్తిగా మతి భ్రమించినట్టు అర్థమైపోతోంది. అమరావతి కల చెదిరిపోవడంతో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు బాబు.

తాజాగా ఆయన ప్రసంగం వింటే బాబు విచక్షణ ఏ స్థాయిలో కోల్పోయారో తెలుస్తుంది. గతంలో వైసీపీ నేతల్ని రాజీనామా చేయాలని, మూడు రాజధానుల్ని అజెండాగా పెట్టుకుని తిరిగి పోటీ చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా వైసీపీ ప్రభుత్వానికి 48గంటలు డెడ్ లైన్ పెట్టారు. అసలు డెడ్ లైన్ పెట్టడానికి, రాజీనామాలు డిమాండ్ చేయడానికి చంద్రబాబు ఎవరు.

జగన్ గేట్లు ఎత్తేస్తే టీడీపీ ఎమ్మెల్యేల వలసలతో ప్రతిపక్ష నేత హోదా కూడా పోయే పరిస్థితి చంద్రబాబుది. అలాంటిది ఏ అధికారంతో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమంటున్నారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయరు? సమస్య పరిష్కారమవుతుందంటే చెప్పండి మేమూ రాజీనామా చేస్తామంటూ డొంకతిరుగుడుగా మాట్లాడి పబ్బం గడుపుకుంటున్నారు బాబు.

మరో అడుగు ముందుకేసి అసెంబ్లీనే రద్దు చేయాలని అడుగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బాబు బొక్కబోర్లా పడి ఏడాదిన్నర కాలేదు, అప్పుడే అంత తొందరయితే ఎలా? అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే అమరావతి ప్రాంతంతో సంబంధం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తెలుగుదేశం గెలవలేదు. అమరావతే ఎన్నికల ప్రధాన అజెండా అయితే మిగతా 11 జిల్లాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఈ విషయాలు తెలిసి కూడా రాజకీయ డ్రామాలాడుతున్నారు బాబు.

ప్రజా ఉద్యమం మొదలు కావాలి, యువత తరలి రావాలి అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 48గంటల్లోగా వైసీపీ నేతలు రాజీనామా చేయాలని, లేకపోతే మరోసారి ప్రెస్ మీట్ పెట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు చంద్రబాబు.

వైసీపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శిస్తున్నారు. వెన్నుపోటు గురించి చంద్రబాబే మాట్లాడాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు అనే మాట ఎక్కడ వినపడినా ముందు గుర్తొచ్చేది చంద్రబాబే. అలాంటి బాబు జగన్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అనడం హాస్యాస్పదం కాక మరేంటి?

ఒకవైపు న్యాయపోరాటం చేస్తారట, మరోవైపు ప్రజా క్షేత్రంలో జగన్ ని దోషిగా నిలబెడతారట. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే రీతిలో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామాలు అడుగుతున్నారు.

First Published:  3 Aug 2020 8:29 AM GMT
Next Story