గోపీచంద్ అంత ధైర్యం చేస్తాడా?

కరోనా దెబ్బకు టాలీవుడ్ లో పనులన్నీ మూలనపడ్డాయి. చిన్నాచితకా సినిమాలు తప్పితే, ఓ మోస్తరు సినిమాలు, కాస్తోకూస్తో క్రేజ్ ఉన్న హీరోలు ఎవ్వరూ సెట్స్ పైకి రావడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతున్న వేళ.. హీరోలెవరూ ధైర్యం చేయడం లేదు. ఒక్క గోపీచంద్ తప్ప.

అవును.. గోపీచంద్ మాత్రం ధైర్యంగా ముందుకొస్తున్నాడు. ఈ నెలలోనే తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న సీటీమార్ సినిమా షూటింగ్ లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. ఈ మూవీని మరో 10 రోజుల్లో సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు మేకర్స్.

మరోవైపు తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ అనే సినిమా చేయబోతున్నాడు గోపీచంద్. ఈ మూవీని కూడా ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకురావాలని దర్శకుడు అనుకుంటున్నాడట.

నిజంగా ఈ 2 సినిమాలు మేకర్స్ చెబుతున్నట్టు చెప్పిన టైమ్ కే సెట్స్ పైకి వస్తే, గోపీచంద్ కరోనాకు ఎదురెళ్తున్నట్టే లెక్క.