షాకింగ్: వాళ్లు హీరో హీరోయిన్లు కాదు

మంచు విష్ణు, కాజల్ హీరోహీరోయిన్లుగా మోసగాళ్లు సినిమా తెరకెక్కుతోంది. వీళ్లిద్దరి ఫస్ట్ లుక్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఈరోజే బయటకొచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణు, కాజల్ హీరోహీరోయిన్లు కాదు. వీళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు. అవును.. రాఖీ పండగ సందర్భంగా ఈ బ్రేకింగ్ న్యూస్ ను బయటపెట్టాడు మంచు విష్ణు

“హాలీవుడ్‌-ఇండియ‌న్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న మోస‌గాళ్లు చిత్రంలో ఇద్ద‌రు ప్ర‌తిభావంతులైన యాక్ట‌ర్లు విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్ తోబుట్టువులుగా ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ పండిస్తున్నారు. ఇప్ప‌టిదాకా మ‌నం చూడ‌ని ఆన్ స్క్రీన్ బ్ర‌ద‌ర్‌-సిస్ట‌ర్ జంట‌గా వాళ్లు అల‌రించ‌నున్నారు. రాఖీ పూర్ణిమ సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్లడిస్తున్నాం.”

చూశారుగా.. స్వయంగా యూనిట్ నుంచి వచ్చిన ప్రకటన ఇది. చ‌రిత్ర‌లో న‌మోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో త‌యార‌వుతున్న ‘మోస‌గాళ్లు’ మూవీకి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి, రుహీ సింగ్‌, న‌వీన్ చంద్ర‌, న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.