Telugu Global
National

‘ఆమెతో రాఖీ కట్టించుకో’.... కోర్టు బెయిల్ కండీషన్ !

‘నువ్వు వెంటబడి వేధించిన అమ్మాయితో రాఖీ కట్టించుకో’… ఇది ఏ సినిమా డైలాగో కాదు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్ కోసం అప్లయి చేసిన ఒక నిందితుడికి కోర్టు విధించిన నిబంధన. మధ్య ప్రదేశ్ హైకోర్టు… ఇండోర్ బెంచ్ ఈ నిబంధన విధించింది. తనపైన కేసు పెట్టిన మహిళ చేత రాఖీ కట్టించుకుని… ఆమెకు జీవితాంతం రక్షణగా ఉంటానని వాగ్దానం చేయాలని, అంతేకాకుండా రాఖీ కట్టినందుకు అక్కాచెల్లెళ్లకు ఇచ్చే బహుమానంగా ఆ మహిళకు నిందితుడు విక్రమ్ […]

‘ఆమెతో రాఖీ కట్టించుకో’.... కోర్టు బెయిల్ కండీషన్ !
X

‘నువ్వు వెంటబడి వేధించిన అమ్మాయితో రాఖీ కట్టించుకో’… ఇది ఏ సినిమా డైలాగో కాదు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్ కోసం అప్లయి చేసిన ఒక నిందితుడికి కోర్టు విధించిన నిబంధన. మధ్య ప్రదేశ్ హైకోర్టు… ఇండోర్ బెంచ్ ఈ నిబంధన విధించింది. తనపైన కేసు పెట్టిన మహిళ చేత రాఖీ కట్టించుకుని… ఆమెకు జీవితాంతం రక్షణగా ఉంటానని వాగ్దానం చేయాలని, అంతేకాకుండా రాఖీ కట్టినందుకు అక్కాచెల్లెళ్లకు ఇచ్చే బహుమానంగా ఆ మహిళకు నిందితుడు విక్రమ్ బాగ్రి 11వేల రూపాయలు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది.

సింగిల్ జడ్జ్ బెంచ్…. జస్టిస్ రోహిత్ ఆర్యా ఈ విభిన్నమైన నిబంధనలు పెట్టారు. నిందితుడు తన భార్యతో సహా తాను వేధించిన మహిళ ఇంటికి రాఖీని, స్వీట్లను తీసుకుని వెళ్లి ఆమెకు ఇచ్చి ఆమెని అడిగి రాఖీ కట్టించుకోవాలని, జీవితాంతం రక్షణగా ఉంటానని ప్రామిస్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఏప్రిల్ 20 వ తేదీన ఉజ్జయిన్ లో ఉంటున్న సదరు మహిళ (30 ఏళ్లు) ఇంట్లోకి ప్రవేశించి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడనే అభియోగంతో విక్రమ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జులై 30న బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఇలాంటి విభిన్నమైన నిబంధనలు పెట్టింది. విక్రమ్… తాను వేధించిన మహిళ కుమారుడికి… అతను బొమ్మలు, బట్టలు కొనుక్కునేందుకు ఐదువేల రూపాయలు ఇవ్వాలని కూడా హైకోర్టు బెంచ్ సూచించింది. కోర్టు విధించిన నిబంధనల మేరకు విక్రమ్ బాగ్రి ఈ రోజు తాను వేధించిన మహిళ ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుని ఉండాలి.

First Published:  3 Aug 2020 7:18 AM GMT
Next Story