టాలీవుడ్ లో మరో కరోనా కేసు

ఆల్రెడీ బండ్ల గణేష్ కు కరోనా సోకింది. తాజాగా దర్శకుడు తేజ కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సింగర్ స్మిత కూడా చేరిపోయింది. తనకు కరోనా సోకినట్టు ఈ గాయని స్వయంగా ప్రకటించింది.

“నిన్నంతా ఒకటే ఒళ్లు నొప్పులు. గట్టిగా వ్యాయామం చేయడం వల్ల వచ్చాయని అనుకున్నాను. ఎందుకైనా మంచిదని టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. మేం అసలు బయటకు వెళ్లలేదు. ఇంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అయినప్పటికీ మమ్మల్ని కరోనా వదల్లేదు.”

ఇలా తన కరోనా వ్యథను బయటపెట్టింది స్మిత. అయితే తను ఏమాత్రం భయపడడం లేదని, కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటాననే ధైర్యం తనకు ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. కరోనా నుంచి బయటపడిన తర్వాత ప్లాస్మా కూడా దానం చేస్తానంటోంది ఈ సీనియర్ గాయని.