వెంకటేష్ సినిమాపై క్లారిటీ

హీరో విక్టరీ వెంకటేశ్, దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఆగిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ ఆ సినిమా ఇంకా పైప్ లైన్లోనే ఉందని ప్రకటించాడు ఈ దర్శకుడు. ఎందుకు ఆలస్యమైందనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు.

పాతికేళ్ల వెంకీ కెరీర్ లో ఇప్పటివరకు అతడ్ని ఎవ్వరూ చూపించని విధంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలనేది తరుణ్ భాస్కర్ కోరిక. అందుకే అతడి కోసం ఓ ప్రత్యేకమైన కథను కూడా రాసుకున్నాడట. అయితే ఆ కథకు చాలా మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని.. అవన్నీ పూర్తయితే తప్ప వెంకీని కలవనని అంటున్నాడు ఈ దర్శకుడు.

తెరపై వెంకటేష్ ఎంత యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తాడో.. రియల్ లైఫ్ లో అంతకంటే ఎంటర్ టైనింగ్ గా ఉంటారని.. ఆ రియల్ లైఫ్ ఎనర్జీని తెరపై చూపించే ప్రయత్నం చేస్తానంటున్నాడు తరుణ్. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఒకేసారి 3-4 కథల పనులు మొదలుపెట్టాడట ఈ దర్శకుడు. లాక్ డౌన్ తర్వాత ఫుల్ బిజీ అవుతానంటున్నాడు.