అంతా క్లియర్ చేసిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్-4పై క్లారిటీ వచ్చేసింది. ఈనెల 30 నుంచి బిగ్ బాస్ సీజన్-4 స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రోమో షూటింగ్ కూడా పూర్తయింది. వచ్చే వారం ఆ ప్రోమో స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతుంది. నాగార్జున హోస్ట్ గా ఈ సీజన్ మొదలుకానుంది.

ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే, ఈ సీజన్ కు సంబంధించి ఆల్రెడీ 30 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వీళ్ల నుంచి 15 మందిని ఫైనల్ గా ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన 15 మంది వెంటనే హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత 30న నేరుగా బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశిస్తారు. కరోనా సోకకుండా ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అంతేకాదు.. హౌజ్ లోకి వెళ్లేముందు పరీక్షలు కూడా చేయబోతున్నారు.

కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్-4ను 50 రోజులకు కుదిస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. ఎప్పట్లానే ఈసారి కూడా 100 రోజుల పాటు సాగబోతోంది ఈ రియాలిటీ షో. ఈనెల 30 నుంచి 3 నెలల పాటు ప్రతి వీకెండ్ బిగ్ బాస్ సీజన్-4లో పాల్గొంటాడు నాగార్జున.