కరోనాతో టీటీడీ అర్చకుడు మృతి

కరోనా తిరుమల అర్చకుడిని బలి తీసుకుంది. తిరుమల ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసాచార్యులు కరోనాతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం ఆయన స్విమ్స్‌లో చేరారు.

కొద్దికాలం క్రితం శ్రీనివాసాచార్యులు గోవిందరాజులస్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్‌పై తిరుమల ఆలయానికి వచ్చారు. శ్రీనివాసాచార్యులు వయసు 45 ఏళ్లు. కొద్దిరోజుల క్రితమే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు మృతి చెందారు.