మా నాన్నకు కరోనా లేదు…

బాలీవుడ్ ను కరోనా వణికిస్తోంది. అమితాబ్, ఐశ్వర్య, అభిషేక్ లాంటి వాళ్లు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఓ హీరోయిన్ తండ్రి కూడా చేరినట్టు బాలీవుడ్ నుంచి కథనాలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదు.

హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలొచ్చాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన దిశా పటానీ.. అలాంటిదేం లేదని స్పష్టంచేసింది. ప్రస్తుతం తన తండ్రి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది.

ఉత్తరప్రదేశ్ లోని విద్యుత్ శాఖలో విజిలెన్స్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ ఎస్పీ హోదాలో పనిచేస్తున్నారు జగదీశ్. ఈమధ్య ఓ కుంభకోణం విచారణ పనిమీద ఆయన లక్నో వెళ్లారు. తిరిగొచ్చిన తర్వాత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు కరోనా సోకినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని దిశా పటానీ ఖండించింది.

ప్రస్తుతం ఈ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ ఇంట్లో ఉంటోంది. ఈ లాక్ డౌన్ టైమ్ అంతా అతడి ఇంట్లోనే గడిపేస్తోంది ఈ చిన్నది.