Telugu Global
National

ఈసారి వేడుకల్లో మూడురంగుల మాస్కులు!

స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతా ఎక్కడ చూసినా జాతీయ జెండాలోని మూడు రంగులు కనబడుతుంటాయి. అలంకరణల్లో, దుస్తుల్లో, ఉపయోగించే వస్తువుల్లో… ఇలా ఏదో ఒక రూపంలో ఆ రంగులు దర్శనమిస్తుంటాయి. అయితే ఈసారి ఈ వేడుకల్లో మూడు రంగుల మాస్కులు సైతం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. దేశ భక్తిని ప్రబోధించేలా జెండా రంగులు, ట్యాగ్ లైన్లు, డిజైన్లతో కూడిన మాస్కులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాని వేదికగా చేసుకునే  వీటి తయారీదారులు […]

ఈసారి వేడుకల్లో మూడురంగుల మాస్కులు!
X

స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతా ఎక్కడ చూసినా జాతీయ జెండాలోని మూడు రంగులు కనబడుతుంటాయి. అలంకరణల్లో, దుస్తుల్లో, ఉపయోగించే వస్తువుల్లో… ఇలా ఏదో ఒక రూపంలో ఆ రంగులు దర్శనమిస్తుంటాయి.

అయితే ఈసారి ఈ వేడుకల్లో మూడు రంగుల మాస్కులు సైతం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. దేశ భక్తిని ప్రబోధించేలా జెండా రంగులు, ట్యాగ్ లైన్లు, డిజైన్లతో కూడిన మాస్కులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాని వేదికగా చేసుకునే వీటి తయారీదారులు అనేకమంది వీటిని అమ్ముతున్నారు.

‘ఆగస్టు 15న దేశభక్తిని ప్రతిబింబించే రంగుల, డిజైన్ల మాస్కులను ధరించడం వలన అటు సురక్షితంగా ఉండవచ్చు… ఇటు సందర్భోచితంగానూ ఉంటుంది. ఒక్కపొర క్లాత్ తో వీటిని తయారు చేస్తున్నాం. యువతతో పాటు పిల్లలు కూడా వీటిని బాగా ఇష్టపడుతున్నారు. మా వద్ద ఎన్95 మాస్కులు సైతం ఉన్నాయి’ అంటున్నాడు ఢిల్లీకి చెందిన వ్యాపారి అంకిత్ టక్కర్. అలాగే మూడు రంగుల టీషర్టులను, వాటికి మ్యాచింగ్ గా అనిపించే మూడు రంగుల మాస్కులను సైతం కొన్ని ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీలు తయారుచేస్తున్నాయి.

కరోనాకారణంగా ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఎక్కువగా జరగని పరిస్థితి ఉంది. దీని వలన అమ్మకాలు తక్కువగానే ఉన్నా… ఏ కార్యక్రమం లేకపోయినా ఆగస్టు 15న దేశభక్తిని ప్రతిబింబించేలా దుస్తులు, మాస్కులు ధరించాలని చాలామంది కోరుకుంటున్నారని… వీటి వ్యాపారులు అంటున్నారు.

మూడురంగుల మాస్కులను ఢిల్లీ అంతటా పంచుతున్న రవి రాఘవ్ అనే వ్యక్తి… ‘ఆనాడు పరాయిపాలననుండి విముక్తి కోసం స్వాతంత్ర్య పోరాటం చేసిన స్ఫూర్తిని… ఇప్పుడు కరోనాపైన చేస్తున్న పోరాటంలో కూడా దేశప్రజలు అందరూ చూపాలి, మనమంతా ఒక్కటై వైరస్ పై పోరాడాలి’ అంటున్నారు.

మొత్తానికి ఈ సారి మన జెండా రంగులు మొహాలపై మాస్కులుగా కనిపించనున్నాయన్నమాట.

First Published:  5 Aug 2020 9:04 PM GMT
Next Story