కరోనా టెస్ట్ చేయించుకుంటేనే పెళ్లికి ఎంట్రీ

రానా పెళ్లికి సరికొత్త నిబంధన పెట్టాడు ఆయన తండ్రి సురేష్ బాబు. కరోనా గడ్డు పరిస్థితుల మధ్య కొడుకు పెళ్లి చేస్తున్న ఈ బడా నిర్మాత.. పెళ్లికి వచ్చేవాళ్లంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వాళ్లు మాత్రమే పెళ్లికి రావాలని కండిషన్ పెట్టాడు.

రామానాయుడు స్టుడియోస్ లో రానా పెళ్లి మరో ఈనెల 8న జరగబోతోంది. లాక్ డౌన్ నిబంధనల మేరకు ఈ పెళ్లికి కేవలం 30 మందిని మాత్రమే ఆహ్వానించారు సురేష్ బాబు. వీళ్లంతా విధిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాడు.

పెళ్లిలో ప్రతి 6 అడుగులకు ఓ శానిటైజర్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన సురేష్ బాబు.. అంతా దూరందూరంగా ఉంటూనే పెళ్లిని వీక్షించాలని కోరుతున్నారు. సింపుల్ గా పెళ్లి తతంగం పూర్తయిన తర్వాత.. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత టాలీవుడ్ కు పెద్ద పార్టీ ఇస్తానంటున్నాడు ఈ నిర్మాత.