గ్రాండ్ గా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్

రానా-మిహీకాల పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఈ జంట మెహందీ ఫంక్షన్ లో పాల్గొంది. దీన్ని పెళ్లికూతురు తరఫు బంధువులు హల్దీ ఫంక్షన్ గా పిలుస్తారు. ఈ వేడుక తర్వాత మరో 2 రకాల వేడుకలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత 8వ తేదీన రానా-మిహీకా పెళ్లి జరుగుతుంది.

ఈరోజు జరిగిన హల్దీ ఫంక్షన్ లో రానా-మిహికా తర్వాత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన వ్యక్తి సమంత. పంజాబీ స్టయిల్ లో డిజైన్ చేసిన దుస్తులు ధరించిన సమంత.. ఈ ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

రామానాయుడు స్టుడియోస్ లో జరగనున్న ఈ పెళ్లికి అతి తక్కువ మంది బంధువుల్ని మాత్రమే ఆహ్వానించారు. పెళ్లి తర్వాత పరిస్థితులను బట్టి టాలీవుడ్ కు పెద్ద పార్టీ ఇస్తాడు రానా.