వెబ్ సిరీస్ చేస్తున్న తేజ

దర్శకుడు తేజకు ఈమధ్య కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా ఎలా సోకిందంటూ మీడియా ఆరా తీయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తేజ దాచిన ఓ విషయం బయటపడింది. అదే వెబ్ సిరీస్.

అవును.. గప్ చుప్ గా ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కానిస్తున్నాడు తేజ. నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టుడియోస్ లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సిరీస్ కు తేజ దర్శకుడు కాదు. తన దగ్గర డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన రాకేష్ అనే వ్యక్తికి మెగా ఫోన్ అప్పగించాడు. తను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు తేజ. ఆయనకు కరోనా సోకడంతో వెబ్ సిరీస్ పనులు ఆగిపోయాయి.

2 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ట్రయిలర్ కట్ చేసి, ఓటీటీ సంస్థలకు చూపించాలనేది తేజ ప్లాన్. తేజకు కరోనా రావడంతో ఆయన వెబ్ సిరీస్ చేస్తున్న విషయం బయటకొచ్చింది.