కొడుకు హీరో… తండ్రి దర్శకత్వం

వారసుల్ని తెరకు పరిచయం చేయడం కొత్తేం కాదు. ప్రస్తుతం ఎంతో క్రేజ్ తో కొనసాగుతున్న హీరోలంతా నటవారసులే. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినోళ్లే. అయితే దర్శకుల తనయులు హీరోలుగా మారడం చాలా తక్కువ. ఈవీవీ సత్యనారాయణ, రవిరాజా పినిశెట్టి లాంటి కొంతమంది దర్శకులకే ఇది సాధ్యమైంది. ఇప్పుడీ లిస్ట్ లోకి సతీష్ వేగేశ్న కూడా చేరిపోతున్నాడు.

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుపొందిన సతీష్ వేగేశ్న తన కొడుకు సమీర్ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఈ మేరకు కథ-స్క్రీన్ ప్లే కూడా పూర్తిచేశాడు. అయితే ఇది పూర్తిగా సతీష్ వేగేశ్న టైపులో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాదు.. ఇందులో కామెడీ-లవ్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాతో తన కొడుకును సోలో హీరోగా పరిచయం చేయడం లేదు వేగేశ్న. ఇదొక మల్టీస్టారర్ సినిమా. ఇందులో మరో యంగ్ హీరో కూడా నటిస్తాడని చెబుతున్నాడు.