3 కోట్లు ఇస్తామన్నా నో చెప్పింది

మంచి సినిమా దొరికింది. వెంటనే రీమేక్ రైట్స్ కొనేశారు. ఆర్భాటంగా లాంఛ్ చేశారు కూడా. కానీ ఇప్పుడా సినిమాలో ఓ కీలకమైన పాత్రను పోషించే నటిని వెదకడం యూనిట్ కు తలకుమించిన భారంగా మారింది. ఆ రీమేక్ ప్రాజెక్టు పేరు అంథాధున్.

హిందీలో సూపర్ హిట్టయిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ను నితిన్ దక్కించుకున్నాడు. తనే హీరోగా, తన సొంత బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ప్రాజెక్టు లాంఛ్ చేశాడు. కానీ హిందీ వెర్షన్ లో టబు పోషించిన పాత్రను చేయడానికి తెలుగులో ఎవ్వరూ ముందుకురావడం లేదు.

ముందుగా ఈ క్యారెక్టర్ కోసం అనసూయను అనుకున్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు నయనతార కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఏకంగా 3 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడట నితిన్. అయినప్పటికీ నయనతార ఒప్పుకోలేదని టాక్.

ఇంతకీ ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసా? భర్త ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ అక్రమ సంబంధం పెట్టుకునే ఓ మహిళ పాత్ర. తన అక్రమ సంబంధం తెలిసిపోయిందని భర్తను చంపేస్తుంది. ఈ విషయం హీరోకు తెలిసిపోయిందని అతడ్ని కూడా చంపడానికి సిద్ధపడే పాత్ర. సౌత్ లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే కాస్త గట్స్ ఉన్న హీరోయిన్ కావాల్సిందే.