ఫ్యాన్స్ భయపడినట్టే జరిగింది

మెగాస్టార్ విషయంలో అభిమానులు ఇన్నాళ్లూ ఏదైతే భయపడ్డారో అదే జరిగింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి సినిమాకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ దర్శకుడితో సినిమా చేయొద్దనేది ఫ్యాన్స్ డిమాండ్. కానీ చిరంజీవి ఎందుకో మెహర్ రమేష్ పై బాగా నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మంచి డిజాస్టర్లు ఇచ్చాడని తెలిసిన మెహర్ రమేష్ కు ఓ ఛాన్స్ ఇవ్వాలనే చిరంజీవి అనుకుంటున్నారట.

తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి రెడీ అవుతున్నారు. ఈ రీమేక్ బాధ్యతల్ని మెహర్ రమేష్ చేతిలో పెట్టాలని చిరు అనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొణెదల ప్రొడక్షన్స్, 14 రీల్స్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుంది.

లెక్కప్రకారం ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి రావాలి. కానీ ఆ స్క్రిప్ట్ ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఒకవేళ లూసిఫర్ లేట్ అయితే, వేదాళం ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలనేది చిరు ఆశ. మధ్యలో దర్శకుడు బాబి ఉన్నప్పటికీ, అతడి స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది.