మరో సినీ ప్రముఖుడికి కరోనా

టాలీవుడ్ ను కరోనా వణికిస్తోంది. తాజాగా మరో ప్రముఖుడు దీని బారిన పడ్డాడు. నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు దానయ్య. అనుమానం వచ్చి పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ గాతేలింది. దీంతో వెంటనే ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

తాజా ఘటనతో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి దర్శకుడు-నిర్మాత ఇద్దరికీ కరోనా సోకినట్టయింది. కొన్ని రోజుల కిందట దర్శకుడు రాజమౌళి, తనకు కరోనా సోకినట్టు ప్రకటించాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య కూడా కరోనా బారిన పడ్డాడు.

దానయ్యకు ఈమధ్యే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స పూర్తయింది. ఆ ఆపరేషన్ నుంచి ఆయన త్వరగానే కోలుకున్నారు. అంతలోనే మళ్లీ కరోనా బారిన పడ్డారు.