మూడో స్థానంలో జగన్

ఇండియా టుడే నిర్వహించిన మూడ్‌ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్‌ సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఇండియాలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ తొలిస్థానంలో ఉన్నారు.

తొలి స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉండగా… రెండోస్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారు. ఈ సర్వేను జులై 15 నుంచి జులై 27 మధ్య నిర్వహించారు. 19 రాష్ట్రాల్లో 97 లోక్‌సభ స్థానాల పరిధిలో ఈ సర్వే నిర్వహించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ బెస్ట్ సీఎం జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. బెంగాల్ సీఎం మమతా నాలుగో స్థానంలో ఉన్నారు. ఆరో స్థానంలో బీహర్ సీఎం నితీష్‌ కుమార్, ఏడో స్థానంలో ఉద్దవ్ థాక్రే, ఎనిమిదవ స్థానంలో నవీన్ పట్నాయక్, తొమ్మిదో స్థానంలో సీఎం కేసీఆర్‌ ఉన్నారు.

ఒక్క యోగి ఆదిత్యనాథ్‌ నెంబర్ 1 స్థానంలో ఉండగా… మిగిలిన బీజేపీ సీఎంలంతా పనితీరులో ఆఖరి స్థానాల్లో నిలిచారు. కర్నాటక సీఎం యడ్యూరప్ప 11వస్థానంలో ఉన్నారు. గుజరాత్‌ సీఎం విజయ్ రుపాని 14వ స్థానంలో ఉన్నారు.

కరోనాను ఎదుర్కొనే విషయంలో… సర్వేలో పాల్గొన్న వారు వారి వారి రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పట్ల 70 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.