ఆర్ఆర్ఆర్ లో అరడజను

ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరక్కపోయినా.. దానికి సంబంధించిన విశేషాలు మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో బిగ్గెస్ట్ న్యూస్ బయటకొచ్చింది. అది కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ కు సంబంధించిన మేటర్.

ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు తారక్. బ్రిటిషర్లను ముప్పుతిప్పలు పెట్టి, వాళ్ల కళ్లుగప్పి తిరిగే పాత్ర ఇది. దీని కోసం సినిమాలో ఎన్టీఆర్ 6 ప్రత్యేకమైన గెటప్స్ లో కనిపిస్తాడట. ఇవన్నీ బ్రిటిషర్ల నుంచి తప్పించుకునేందుకు ఎన్టీఆర్ చేసే సాహసాల్లో భాగంగా వస్తాయంటున్నారు.

ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే. ఇప్పటివరకు ఒక సినిమాలో ఒక గెటప్ లోనే ఎన్టీఆర్ ను చూశారు ఫ్యాన్స్. మహా అయితే కొన్ని సినిమాల్లో 2 గెటప్స్ లో చూసి ఉంటారు. కానీ ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో 6 గెటప్స్ లో ఎన్టీఆర్ అంటే.. నిజంగా ఇది ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

అయితే ఇప్పుడీ మేటర్ పై క్లారిటీ ఇవ్వడానికి ఎవ్వరూ అందుబాటులో లేరు. చివరికి దర్శకుడు రాజమౌళి కూడా కరోనా వల్ల హోం ఐసొలేషన్ లో ఉన్నాడు.