మహేష్ బర్త్ డే గిఫ్ట్ బాగుంది

ఈరోజు మహేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి కొత్త సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సర్కారువాటి పాట మోషన్ పోస్టర్ బాగుంది.

నిజానికి ఇందులో కొత్తదనం ఏమీ లేదు. టైటిల్ ఆల్రెడీ అందరికీ తెలుసు. దాని డిజైన్ కూడా అందరికీ తెలుసు. రూపాయి బిళ్ల కాన్సెప్ట్ కూడా తెలిసిందే. వీటన్నింటినీ కలిపి మోషన్ పోస్టర్ గా మార్చారు.

ఉన్నంతలో కొత్తదనం ఏదైనా ఉందంటే.. మోషన్ పోస్టర్ కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే. ఆల్రెడీ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ లోని చిన్న బిట్ ను మోషన్ పోస్టర్ కు తగిలించి వదిలారు. మిగతాదంతా సేమ్ టు సేమ్.

అన్నట్టు ఈ టైటిల్ సాంగ్ ను శృతిహాసన్ పాడిందంట.