బెజవాడలో భారీ అగ్నిప్రమాదం…. నలుగురు కోవిడ్ పేషెంట్లు మృతి

విజయవాడలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కరోనా పేషెంట్లు మృతి చెందారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను రమేష్‌ ఆస్పత్రి ఇటీవల అద్దెకు తీసుకుని… కోవిడ్ సెంటర్‌ను నడుపుతోంది. అందులో 50 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.

తెల్లవారుజామున కంప్యూటర్‌ రూంలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఒకటి రెండు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెల్లవారుజామున 5గంటలకు అక్కడికి చేరుకుని తక్షణం మంటలను అదుపు చేశారు. అయితే పొగ కారణంగా ఊపిరి ఆడక నలుగురు కరోనా పేషెంట్లు మృతి చెందారు.

మిగిలిన వారిని ప్రత్యేక అంబులెన్స్‌లలో ఇతర కరోనా సెంటర్లకు పోలీసులు తరలించారు. హోటల్‌ సిబ్బందిలో ఇద్దరు భయంతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. వారిలో ఒక వ్యక్తికి కాలు విరిగింది.