Telugu Global
National

కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటు ధరలోనే " భారత్ బయోటెక్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు, యూనివర్సిటీలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. కాగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా త్వరగా అభివృద్ధి చేయాలనే ఒత్తిడి ఉన్నా.. కోవిడ్ వ్యాక్సిన్‌ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో సురక్షితంగా తయరు చేస్తున్నామని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ […]

కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటు ధరలోనే  భారత్ బయోటెక్
X

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు, యూనివర్సిటీలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. కాగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా త్వరగా అభివృద్ధి చేయాలనే ఒత్తిడి ఉన్నా.. కోవిడ్ వ్యాక్సిన్‌ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో సురక్షితంగా తయరు చేస్తున్నామని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ల కృష్ణ వెల్లడించారు.

కోవిడ్ వ్యాక్సిన్ ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి నిత్యం కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో మాపై కూడా వ్యాక్సిన్‌ను త్వరగా అభివృద్ధి చేయాలనే ఒత్తిడి పెరిగింది. అయితే భద్రత విషయంలో రాజీ పడకుండా వ్యాక్సిన్ తయారు చేస్తామని ఆయన చెప్పారు. భారత్ బయోటెక్ అత్యత్తమ ప్రమాణాలతో క్లినికల్ పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అభివృద్ధి పని తీరును అంతర్జాతీయ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ విజయవంతం అయితే అది భారత్ బయోటెక్‌కే కాకుండా యావత్ భారత దేశానికే ఎంతో ప్రతిష్టాత్మక అంశం అని కృష్ణ అన్నారు. బీబీ తయారు చేసిన రోటా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు 6 నెలల సమయం పడితే కరోనా వైరస్ వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ తొలి దశకు కేవలం 30 రోజులే పట్టిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్‌లో ప్రవేశించిందని ఆయన అన్నారు.

చాలా మందికి భారతీయ కంపెనీల సామర్థ్యాలపై అపనమ్మకాలున్నాయి. రోటావైరస్, పోలీయో సహా మరి కొన్ని వ్యాధులకు ఇండియాలోనే వ్యాక్సిన్లు అభివృద్ధి చేసి వారికి సరైన సమాధానం చెప్పామన్నారు. రోటావైరస్ వ్యాక్సిన్‌ను జీఎస్కే 85 డాలర్లకు అందిస్తే, తాము అదే నాణ్యతతో కేవలం 1 డాలర్‌కే ఇచ్చామని.. త్వరలో రాబోయే కరోనా వ్యాక్సిన్ కూడా తక్కువ ధరకే అందిస్తామని ఆయన చెప్పారు.

First Published:  9 Aug 2020 8:50 PM GMT
Next Story