Telugu Global
National

కోవిడ్ ట్రీట్మెంట్ వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా విషయంలో ఒక ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు 3టీ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తూ కోవిడ్-19పై చిత్త శుద్దితో పోరాటం చేస్తున్నారు. టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తుండటంతో ప్రతీ నిత్యం భారీ సంఖ్యలో కేసులు బయటపడినా.. వారిని వెంటనే హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్‌లకు పంపడం, ఆందోళనకరంగా ఉన్న వారిని ఆసుపత్రుల్లో చేర్చడం ద్వారా ప్రమాదాన్ని నివారిస్తున్నారు. ఏపీలో ప్రతీ రోజు 60వేలకు […]

కోవిడ్ ట్రీట్మెంట్ వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా విషయంలో ఒక ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు 3టీ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తూ కోవిడ్-19పై చిత్త శుద్దితో పోరాటం చేస్తున్నారు. టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తుండటంతో ప్రతీ నిత్యం భారీ సంఖ్యలో కేసులు బయటపడినా.. వారిని వెంటనే హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్‌లకు పంపడం, ఆందోళనకరంగా ఉన్న వారిని ఆసుపత్రుల్లో చేర్చడం ద్వారా ప్రమాదాన్ని నివారిస్తున్నారు.

ఏపీలో ప్రతీ రోజు 60వేలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసులు పెరుగుతుండటంతో చికిత్సలో కూడా వేగం పెంచుతున్నారు. ప్రతీ రోగి స్వభావాన్ని బట్టి వైద్యం అందిస్తూ కోవిడ్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏపీలో ఐసీయూలో చేరే వాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇక సీఎం ఆదేశాల మేరకు ఐసీయూలో చేరే వారికి కూడా ప్రాణాపాయం తగ్గించడానికి మెరుగైన ఏర్పాట్లు చేశారు. బెడ్ల సంఖ్య పెంచడమే కాకుండా ఆక్సిజన్ అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

కాగా కోవిడ్ పరీక్షలకు, ఫలితాలకు మధ్య సమయం ఎక్కువగా ఉండటంతో అప్పటికే కరోనా బారిన పడిన వారు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని గుర్తించిన అధికారులు.. ఫలితాలను మరింత వేగంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు రాకపోయినా.. ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువగా ఉన్న వాళ్లను వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే ఈ విధానం అవలంభించడం వల్ల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగారు.

రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు వచ్చేఅవకాశం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ వేగాన్ని పెంచాలని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా క్వారంటైన్‌లో ఉంటున్న వారికి సరైన పోషకాహారం కూడా అందించాలని.. అవసరం అయిన వ్యక్తులకు అదనపు పర్యవేక్షణ చేసి కోలుకునేలా చేయాలని సీఎం ఆదేశించారు.

First Published:  10 Aug 2020 12:10 AM GMT
Next Story