Telugu Global
National

ఉత్తరాది పెత్తనం... కనిమొళికి చేదు అనుభవం

చాలాకాలంగా దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ఉత్తరాది శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలు తమిళనాడు ప్రజలు దశాబ్దాల క్రితం తిప్పికొట్టారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తమిళనాడు విషయంలో కేంద్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. తమిళ ప్రజలు కూడా హిందీ ప్రాంత ఆధార జాతీయ పార్టీలను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వలేదు. తాజాగా తమిళనాడు ఎంపీ, డీఎంకే నేత కనిమొళికి భాష విషయంలో చేదు అనుభవం ఎదురైంది. ఒక సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారిణి తనలోని […]

ఉత్తరాది పెత్తనం... కనిమొళికి చేదు అనుభవం
X

చాలాకాలంగా దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ఉత్తరాది శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలు తమిళనాడు ప్రజలు దశాబ్దాల క్రితం తిప్పికొట్టారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తమిళనాడు విషయంలో కేంద్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. తమిళ ప్రజలు కూడా హిందీ ప్రాంత ఆధార జాతీయ పార్టీలను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వలేదు.

తాజాగా తమిళనాడు ఎంపీ, డీఎంకే నేత కనిమొళికి భాష విషయంలో చేదు అనుభవం ఎదురైంది. ఒక సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారిణి తనలోని హింది ఆధిపత్య భావజాలాన్ని కనిమొళిపై ప్రదర్శించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో కనిమొళి వెల్లడించడంతో ఆమెకు అనేక మంది మద్దతుగా నిలుస్తున్నారు. #hindiimpostion పేరుతో హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.

విమాన ప్రమాదం జరిగిన కేరళలోని కొలికోడ్‌ ఎయిర్‌పోర్టుకు కనిమొళి వెళ్లిన సమయంలో .. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారిని హిందీలో మాట్లాడారు. హిందీ సరిగా అర్థం చేసుకోలేకపోయిన కనిమొళి తమిళంలోగానీ, ఇంగ్లీష్‌లో గానీ మాట్లాడాల్సిందిగా కోరారు. దాంతో సదరు అధికారిణి ”హిందీ రాదా…ఇంతకు మీరు భారతీయులేనా?” అంటూ నోరు పారేసుకుంది.

దీనిపై ట్వీట్ చేసిన కనిమొళి ”హిందీ తెలియదా? ఇంతకూ మీరు భారతీయులేనా? అని ఆమె నన్ను ప్రశ్నించింది. అంటే హిందీ భాష వచ్చినవారే భారతీయులా!’” అని ప్రశ్నించారు. కనిమొళికి మద్దతుగా తమిళ ప్రజలతో పాటు, దక్షిణాది రాష్ట్రాల నెటిజన్లు పెద్దెత్తున మద్దతు తెలుపుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తున్నారని హిందీవాదులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీ మాట్లాడే వారిదేనా భారతదేశం అని పలువురు నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రాంతీయ భాషలను చంపే కుట్రతోనే ఇలా పదేపదే హిందీ పేరుతో అవమానిస్తున్నారని పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు.

ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో సీఐఎస్‌ఎఫ్‌ దిగివచ్చింది. విచారణ చేపట్టి సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని సీఐఎస్‌ఎఫ్‌ స్పష్టం చేసింది.

First Published:  10 Aug 2020 5:44 AM GMT
Next Story