పిల్ల మరో ఛాన్స్ పట్టేసింది

కేతిక శర్మ.. ఈ హాట్ బ్యూటీని చూస్తే చాలు అవకాశాలు ఇవ్వాలనిపిస్తోంది. హాట్ హాట్ ఫొటో షూట్స్ తో ఇప్పటికే పిచ్చెక్కించిన ఈ చిన్నది.. ఇప్పుడు సినిమాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది. మొదటి సినిమా “రొమాంటిక్” ఇంకా రిలీజ్ అవ్వకముందే వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది.

ఆకాష్ పూరితో చేస్తున్న రొమాంటిక్ మూవీ సెట్స్ పై ఉంటుండగానే నాగశౌర్య సరసన నటించే అవకాశం పొందింది కేతిక శర్మ. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో రాబోతున్న సినిమాలో కేతిక మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు దీనికి అదనంగా మరో ఛాన్స్ కొట్టేసింది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ ఐటెంసాంగ్ చేయడానికి అంగీకరించింది. ఈ సినిమాలో నభా నటేష్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అను ఎమ్మాన్యుయేల్ సెకెండ్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. వీళ్లకు కొనసాగింపుగా ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది కేతిక శర్మ.

తన సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఎప్పుడున్నా హాట్ భామలతో దాన్ని తెరకెక్కించడానికి ఇష్టపడతాడు బెల్లంకొండ. గతంలో ఇతడి సినిమాలో ఏకంగా తమన్న ఐటెంసాంగ్ చేసింది. ఇప్పుడు కేతిక శర్మకు అవకాశం దక్కింది.