అంతా కలిసి వరల్డ్ రికార్ట్ కొట్టారు

మహేష్ ఫ్యాన్స్ అంతా కలిసి, తమ అభిమాన హీరో కోసం నిన్నంతా బాగా కష్టపడ్డారు. ఎంతలా అంటే అభిమానులంతా కలిసి ఏకంగా వరల్డ్ రికార్డ్ కొట్టారు. అవును.. #HBDMaheshBabu అనే హ్యాష్ మొన్న అర్థరాత్రి నుంచి నిన్నటి అర్థరాత్రి వరకు ట్రెండింగ్ అవుతూనే ఉంది.

అలా ఈ 24 గంటల్లో ఈ హ్యాష్ ట్యాగ్ ఏకంగా 6 కోట్ల హిట్స్ సాధించింది. ఓ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ కు 6 కోట్ల వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకే ఇది వరల్డ్ రికార్డ్ అయింది. ఈ రికార్డ్ లో ఏకంగా 15 లక్షల మంది మహేష్ అభిమానులు పాల్గొన్నట్టు ఓ అంచనా.

మహేష్ నిన్న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడి ఫ్యాన్స్ నిన్నంతా ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసే పనిలోనే పడ్డారు. మహేష్ నటించబోయే సర్కారువారి పాట సినిమాకు సంబంధించి నిన్న మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. చివరికి ఆ మోషన్ పోస్టర్ వీడియోకు కూడా ఇన్ని వ్యూస్ రాలేదు.