మాస్ రాజాకు హీరోయిన్లు ఫిక్స్

త్వరలోనే రెండు సినిమాలు చేయబోతున్నాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు. ఈ రెండూ ఒకేసారి సెట్స్ పైకి వస్తాయని అంతా అనుకుంటున్నారు. రవితేజ ఆలోచన కూడా అదే. కాకపోతే త్రినాధరావు నక్కిన సినిమా కంటే రమేష్ వర్మ మూవీ తొందరగా సెట్స్ పైకి వచ్చేలా ఉంది.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే కథ-స్క్రీన్ ప్లే లాక్ చేశారు. తాజాగా హీరోయిన్లను కూడా ఫైనలైజ్ చేశారు. రవితేజ-రమేష్ వర్మ సినిమాలో హీరోయిన్లుగా రాశి ఖన్నా, నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. రవితేజతో నటించడం నిధి అగర్వాల్ కు ఇదే ఫస్ట్ టైమ్. రాశిఖన్నా మాత్రం గతంలో మాస్ రాజాతో బెంగాల్ టైగర్ సినిమా చేసింది.

అటు త్రినాధరావు నక్కిన సినిమా ఇంకాస్త లేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి అన్నీ ఓకే అయినప్పటికీ… తాజాగా ఈ సినిమా రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ పెళ్లి చేసుకున్నాడు. అతడు కాస్త గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. అటు దర్శకుడు కూడా స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు.