సమంత ఇక సినిమాలు ఆపేసినట్టేనా!

ప్రస్తుతం ఆమెను చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. సమంత ఇప్పుడు సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కనీసం వాటి గురించి మాట్లాడ్డం కూడా తగ్గించేసింది. ఆమె దృష్టి మొత్తం ఇప్పుడు మంచి జీవన విధానంపై ఉంది. ఇది ఆమె తనకుతాను తీసుకున్న నిర్ణయమా లేక కరోనా వల్ల ఆమెలో వచ్చిన మార్పా అనేది స్పష్టంగా చెప్పలేం.

ప్రస్తుతం సమంత తన ఇంటి టెర్రస్ పైనే కూరగాయలు సాగు చేస్తోంది. వివిధ రకాల కూరగాయలు పండించి వాటినే తింటోంది. మరోవైపు యోగా చేస్తోంది. శరీరానికి పనికొచ్చే రకరకాల జ్యూసులు తయారుచేసుకొని తాగుతోంది. వీటిని మాత్రమే ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో పెడుతోంది. వీటి గురించే మాట్లాడుతోంది.

నిజానికి లాక్ డౌన్ పడ్డానికి ముందే 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. ఇప్పుడు వాటి గురించి మాట్లాడ్డం మానేసింది. మరి ఆ సినిమాల్ని ఆమె కొనసాగిస్తుందా లేక వాటి నుంచి తప్పుకుంటుందా అనేది చూడాలి.

మరోవైపు పబ్లిక్ లో కూడా కనిపించడం మానేసింది ఈ బ్యూటీ. రానా పెళ్లిలో మాత్రం కాస్త హడావుడి చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇంటికే పరిమితమైపోయింది.