బోల్డ్ వెబ్ సిరీస్ లో అమలా పాల్

అమలాపాల్ కూడా ఓ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిన సంగతి పాత విషయమే. ఇప్పుడీ మేటర్ కు సంబంధించి కొత్త కొత్త అప్ డేట్స్ బయటకొచ్చాయి. మహేష్ భట్ క్యాంప్ కు చెందిన పుష్పదీప్  భరధ్వాజ్ డైరక్షన్ లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో అమలాపాల్ మరోసారి బోల్డ్ గా  కనిపించబోతోందట.

తెరపై బోల్డ్ గా కనిపించడం అమలాపాల్ కు కొత్తేంకాదు. “ఆమె” అనే సినిమాలో పూర్తిగా నగ్నంగా నటించింది అమలాపాల్. ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా అలాంటి బోల్డ్ సీన్స్ ఉండబోతున్నాయి.  మహేష్ భట్, జియో స్టుడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సిరీస్ లో తహిర్ బసిన్, అమృతా  పూరి ఇతర కీలక పాత్రలు పోషించబోతున్నారు

ఓ నవల ఆధారంగా పీరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. 1970ల నాటి బాలీవుడ్ పరిస్థితుల నేపథ్యంలో… ఓ హీరోయిన్ ప్రేమకథగా ఈ సిరీస్ రాబోతోంది.