నానికి మానసిక సమస్య లేదట…

హీరో నాని ఓ మానసిక సమస్యతో బాధపడుతున్నాడట. మరీ ముఖ్యంగా అతడికి పైపోలార్ సిండ్రోమ్ అనే డిజాస్టర్ వచ్చిందట. అయితే ఇదంతా రియల్ లైఫ్ లో కాదు. టక్ జగదీశ్ అనే సినిమాలో. ఈ సినిమాలో నాని పాత్ర, ఇలా ఓ మానసిక సమస్యతో బాధపడే క్యారెక్టర్ అంటూ 2 రోజులుగా ప్రచారం జరిగింది,

దీనిపై తాజాగా నాని స్పందించాడు. ఓ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నేచురల్ స్టార్.. టక్ జగదీశ్ లో తన పాత్రకు ఎలాంటి బలహీనతలు, సమస్యలు ఉండవని స్పష్టంచేశారు. ఇంకా చెప్పాలంటే టక్ జగదీశ్ సినిమా ఓ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నాడు ఈ హీరో.

ఈ ఏడాది జనవరి 30న ప్రారంభమైంది టక్ జగదీశ్. లెక్కప్రకారం జులైలో విడుదల కావాలి. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోవడంతో రిలీజ్ అవ్వలేదు. సెప్టెంబర్ మూడో వారం లేదా అక్టోబర్ నుంచి తిరిగి షూట్ స్టార్ట్ చేసి, సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.