Telugu Global
NEWS

రాజధానిపై కేంద్రం రోల్ ఉండదు... ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీ

ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండబోదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానులు లేవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. యూపీలాంటి పెద్ద రాష్ట్రాలకు కూడా ఒకే రాజధాని ఉందన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం హైకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేసిందన్నారు. అది రాజ్యాంగబద్దమైన స్పందనన్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉన్నా ఎందుకు విజయవాడకు పరిగెత్తి వచ్చారో అందరికీ తెలుసన్నారు. ఆ రోజు కూడా […]

రాజధానిపై కేంద్రం రోల్ ఉండదు... ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీ
X

ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండబోదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానులు లేవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. యూపీలాంటి పెద్ద రాష్ట్రాలకు కూడా ఒకే రాజధాని ఉందన్నారు.

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం హైకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేసిందన్నారు. అది రాజ్యాంగబద్దమైన స్పందనన్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉన్నా ఎందుకు విజయవాడకు పరిగెత్తి వచ్చారో అందరికీ తెలుసన్నారు. ఆ రోజు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదన్నారు.

అమరావతిలో రాజధాని పెడతామంటే కేంద్రం నాడు అభ్యంతరం చెప్పలేదన్నారు. ఇప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిపై కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. కానీ రాజకీయంగా మూడు రాజధానుల అంశాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉంటుందన్నారు.

ఏపీలో బీజేపీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, విమర్శనాత్మక మిత్రుడిగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం స్థానం ఖాళీగా ఉందన్నారు. బీజేపీ సమర్థవంతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందన్నారు. మంచి చేస్తే అభినందిస్తామని… చెడు చేస్తే విమర్శిస్తామన్నారు.

కన్నా లక్ష్మీనారాయణను తొలగించి సోమువీర్రాజును నియమించారని అనుకోవద్దని… కన్నాకు మరో బాధ్యత అప్పగించవచ్చు అన్నారు రాంమాధవ్. బీజేపీలో సమిష్టి నాయకత్వం ఉంటుందన్నారు.

First Published:  11 Aug 2020 6:53 AM GMT
Next Story