Telugu Global
CRIME

అల్లర్లతో అట్టుడికిన బెంగళూరు నగరం

సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు కారణంగా బెంగళూరు నగరం అల్లర్లతో అట్టుడికింది. బెంగళూరు నగరంలో ప్రస్తుతం కర్ప్యూ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరుస్తూ పోస్టు పెట్టారు. దాంతో అల్లర్లు చెలరేగాయి. అల్లరి మూకలు ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడి చేశాయి. ఇంటికి నిప్పు పెట్టాయి. మంటలార్పేందుకు వచ్చిన ఫైరింజన్లపైనా దాడి చేశారు. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. దాంతో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. అల్లరి […]

అల్లర్లతో అట్టుడికిన బెంగళూరు నగరం
X

సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు కారణంగా బెంగళూరు నగరం అల్లర్లతో అట్టుడికింది. బెంగళూరు నగరంలో ప్రస్తుతం కర్ప్యూ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరుస్తూ పోస్టు పెట్టారు. దాంతో అల్లర్లు చెలరేగాయి. అల్లరి మూకలు ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడి చేశాయి. ఇంటికి నిప్పు పెట్టాయి. మంటలార్పేందుకు వచ్చిన ఫైరింజన్లపైనా దాడి చేశారు. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు.

దాంతో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. అల్లరి మూకలు రెచ్చిపోవడంతో పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. అల్లర్లలో వందలాది మంది గాయపడ్డారు. అల్లర్లను అదుపు చేసే క్రమంలో అల్లరి మూకల దాడుల్లో 60 మంది పోలీసులూ గాయపడ్డారు. బెంగళూరుతో పాటు కేజే హళ్లి, డీజే హళ్లిలో కర్ప్యూ విధించారు.

పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే మేనల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లరిమూకల దాడిలో వీధుల్లో ఇళ్ల ముందు పార్కు చేసిన వందలాది కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. దాడులకు సూత్రధారులైన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఎమ్మెల్యే మేనల్లుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

First Published:  12 Aug 2020 3:13 AM GMT
Next Story