పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కన్నుమూశారు. కరోనాతో ఆయన చనిపోయారు. 2009లో కడప లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఆయన జగన్‌మోహన్ రెడ్డిపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

రాయలసీమ ప్రాంత సమస్యలపై గళమెత్తేవారు. మోడరల్ రాయలసీమ సంస్థను పాలెం శ్రీకాంత్ రెడ్డి స్థాపించారు. కరోనా బారిన పడి శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.