Telugu Global
National

రమేష్ ఆస్పత్రి కొత్త విషయాలు... వీవీబీ చౌదరి వాట్సాప్ పోస్టు

రమేష్ ఆస్పత్రికి సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రమేష్ ఆస్పత్రి దోపిడికి సంబంధించి అధికారుల విచారణలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అసలు కరోనా లేని వారికి కూడా కరోనా పేరుతో డబ్బులు గుంజుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. కేవలం సీటీ స్కాన్ చేసి జబ్బు ముదిరింది అని హడలగొట్టి ఆస్పత్రిలో చేర్చుకుంటున్నట్టు తేల్చారు. అగ్నిప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చికిత్స పొందుతున్న వారికి అధికారులు కరోనా పరీక్షలు చేయగా…31 మందిలో 26 మందికి […]

రమేష్ ఆస్పత్రి కొత్త విషయాలు... వీవీబీ చౌదరి వాట్సాప్ పోస్టు
X

రమేష్ ఆస్పత్రికి సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రమేష్ ఆస్పత్రి దోపిడికి సంబంధించి అధికారుల విచారణలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అసలు కరోనా లేని వారికి కూడా కరోనా పేరుతో డబ్బులు గుంజుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు.

కేవలం సీటీ స్కాన్ చేసి జబ్బు ముదిరింది అని హడలగొట్టి ఆస్పత్రిలో చేర్చుకుంటున్నట్టు తేల్చారు. అగ్నిప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చికిత్స పొందుతున్న వారికి అధికారులు కరోనా పరీక్షలు చేయగా…31 మందిలో 26 మందికి అసలు కరోనా లేదని తేలింది. ప్రమాదంలో మృతి చెందిన 10మంది మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి కరోనా నెగిటివ్ అని వచ్చింది.

దాంతో కేవలం కరోనా భయాన్ని క్యాష్ చేసుకునేందుకు వైరస్‌ సోకని వారిని కూడా ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. రోజుకు 35 వేల నుంచి 50వేల వరకు గుంజుతున్నట్టు తేలింది.

సురక్ష ఆస్పత్రి యజమాని వీవీబీ చౌదరి… ఈ తరహా దోపిడిపై ఆవేదన వ్యక్తం చేస్తూ డాక్టర్స్ వాట్సాప్‌ గ్రూపులో ఒక పోస్టు పెట్టారు. హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో అశువులు బాసిన వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నా డాక్టర్స్‌ కమ్యూనిటీని చూస్తుంటే కోపం కలుగుతోంది. మన ఆశకి అంతులేకుండా పోతోంది.

మనందరికీ తెలుసు.. ఇప్పుడు హాస్పిటల్స్‌లో వైద్యం చేస్తున్న కరోనా పేషెంట్స్‌లో ఎంతమందిని ఆస్పత్రుల్లో ఉంచాల్సిన అవసరం ఉందో? లేదో!. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వీలైనంత తక్కువలో వైద్యం చేయాల్సిందిపోయి మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. ఇలాంటి పనుల వల్లే మనం ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం’ అంటూ డాక్టర్ వీవీబీ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  12 Aug 2020 6:21 AM GMT
Next Story