కిలాడీగా మారిన మాస్ రాజా

హీరో రవితేజ కొత్త సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లాక్ డౌన్ ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొనేలోపు కొత్త సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్లను ఆల్రెడీ లాక్ చేసిన యూనిట్.. ఇప్పుడు సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో పడింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. దీనికి రవితేజ కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, రాశిఖన్నాను తీసుకున్నారు.

హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమా ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే రవితేజ చేతిలో క్రాక్ సినిమా ఉంది. అది పూర్తయితే కానీ, ఇది సెట్స్ పైకి రాదు. ఈ గ్యాప్ లో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తిచేయాలనేది ప్లాన్.