సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్… ట్రీట్మెంట్ కోసం అమెరికా పయనం

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. అనారోగ్యంతో ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శ్వాస సంబంధి సమస్యలు, ఛాతిలో నొప్పితో మూడు రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కరోనా సోకిందేమో అనే అనుమానంతో పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు.

ఈ క్రమంలో సంజయ్ దత్‌కు మరికొన్ని పరీక్షలు నిర్వహించగా ఆయనకు ప్రాణాంతకమైన లంగ్ క్యాన్సర్ వచ్చినట్లు తేలింది. ఆయన ప్రస్తుతం 3వ దశ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన అమెరికా వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకోవాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలో సంజయ్ దత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను కొంతకాలం షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు తెలిపారు. కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా విరామం తీసుకుంటున్నానని ఫ్యాన్స్ బాధపడొద్దని ప్రకటించాడు. సంజయ్ దత్ ప్రకటనతో అతని అభిమానులతో పాటు బంధువులు, మిత్రులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.