Telugu Global
National

బీజేపీ భుజంపై రాజధాని తుపాకీ పెడుతున్న బాబు మీడియా..

ఏపీ రాజధాని విషయంలో మా జోక్యం ఉండదు ఉంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందంటే అర్థమేంటి? మూడు రాజధానులకు పరోక్షంగా మద్దతు తెలిపినట్టే కదా? మరి ఇంకా ఎందుకీ రాద్ధాంతం. బీజేపీ నేతల మాటలకు వక్రీకరణలు ఎందుకు? పదే పదే బీజేపీని ఈ విషయంలోకి లాగడం ఎందుకు? ప్రస్తుతం చంద్రబాబు అనుకూల మీడియా ఇదే విషయాన్ని పట్టుకుని వేలాడుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో మరోసారి ఈ అంశంపై స్పష్టతనిచ్చారు బీజేపీ […]

బీజేపీ భుజంపై రాజధాని తుపాకీ పెడుతున్న బాబు మీడియా..
X

ఏపీ రాజధాని విషయంలో మా జోక్యం ఉండదు ఉంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందంటే అర్థమేంటి? మూడు రాజధానులకు పరోక్షంగా మద్దతు తెలిపినట్టే కదా? మరి ఇంకా ఎందుకీ రాద్ధాంతం. బీజేపీ నేతల మాటలకు వక్రీకరణలు ఎందుకు? పదే పదే బీజేపీని ఈ విషయంలోకి లాగడం ఎందుకు? ప్రస్తుతం చంద్రబాబు అనుకూల మీడియా ఇదే విషయాన్ని పట్టుకుని వేలాడుతోంది.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో మరోసారి ఈ అంశంపై స్పష్టతనిచ్చారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. అయితే ఆయన చెప్పిన విషయం ఒకటైతే.. బాబు మీడియా హైలెట్ చేసింది మరో అంశాన్ని.

పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కి ఒకటే రాజధాని ఉంటే.. ఏపీకి మూడు రాజధానులు అవసరమా అని రామ్ మాధవ్ అన్నారని, అంటే మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకం అని, ఇక జగన్ ఆటలు సాగవు అని విపరీతార్థాలు తీశారు. వీర్రాజు మాట్లాడినా, రామ్ మాధవ్ మాట్లాడినా.. ఆఖరికి సుజనా చౌదరి రెచ్చిపోయినా కేంద్రం ఈపాటికే క్లారిటీ ఇచ్చేసింది. అయినా కూడా బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి రాజధాని అంశాన్ని టార్గెట్ చేయాలని చూస్తోంది టీడీపీ, బాబు అనుకూల మీడియా.

మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకం అని పదే పదే నిరూపించాలని చూస్తున్నారు. అయినా సరే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఇప్పుడీ ఎత్తుగడ వేశారు. బీజేపీ నేతలు ఎవరు మాట్లాడినా, ఏం మాట్లాడినా, రాజధాని అంశంతో ముడిపెట్టి విపరీతార్థాలు తీస్తున్నారు.

సుజనా చౌదరి లాంటి బాబు కోవర్టుల నోటికి ఆల్రడీ తాళం పడింది. తలెగరేస్తున్న మరికొందరిని పార్టీ సస్పెండ్ చేసింది. రాజధాని విషయంలో తమ జోక్యం లేదని కేంద్రం కోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసిందంటే ఇక అంతకంటే క్లారిటీ ఏంకావాలి.

కానీ చంద్రబాబు అనుకున్నది నెరవేరలేదు కాబట్టి అనుకూల మీడియాతో ఇలా మంటపెట్టాలని చూస్తున్నారు. వైసీపీ నేతలెవరైనా రెచ్చిపోయి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడితో రాద్ధాంతం మొదలు పెట్టాలనేది బాబు ప్లాన్. ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యేవరకు ఇలాంటి జిమ్మిక్కులన్నిటినీ చూడాల్సిందే.

First Published:  12 Aug 2020 3:15 AM GMT
Next Story