Telugu Global
CRIME

తూత్తుకుడి లాకప్‌డెత్ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎస్ఐ కరోనాతో మృతి

తమిళనాడులోని తూత్తుకుడిలో తండ్రి, కొడుకుల లాకప్ డెత్ విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మరణాలకు సంబంధించి అరెస్టయ్యిన సబ్ ఇన్‌స్పెక్టర్ పాల్ దొరై కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. టూటికొరిన్‌లో తండ్రి కొడుకులైన జయరాజ్, ఫెనిక్స్ కస్టడీ మరణాలకు సంబంధించి అరెస్టయిన 10 మంది నిందితులను మధురై సెంట్రల్ జైలులో ఉంచారు. లాక్‌డౌన్ సమయంలో తమ మొబైల్ షాప్ తెరిచారనే కారణంతో తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్‌లో పోలీసులు పెట్టిన […]

తూత్తుకుడి లాకప్‌డెత్ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎస్ఐ కరోనాతో మృతి
X

తమిళనాడులోని తూత్తుకుడిలో తండ్రి, కొడుకుల లాకప్ డెత్ విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మరణాలకు సంబంధించి అరెస్టయ్యిన సబ్ ఇన్‌స్పెక్టర్ పాల్ దొరై కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. టూటికొరిన్‌లో తండ్రి కొడుకులైన జయరాజ్, ఫెనిక్స్ కస్టడీ మరణాలకు సంబంధించి అరెస్టయిన 10 మంది నిందితులను మధురై సెంట్రల్ జైలులో ఉంచారు.

లాక్‌డౌన్ సమయంలో తమ మొబైల్ షాప్ తెరిచారనే కారణంతో తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్‌లో పోలీసులు పెట్టిన హింసకు వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి కారణమైన ఇద్దరు ఎస్ఐలతో పాటు నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసి.. కేసు విచారణను సీబీఐకి అప్పగించారు.

కాగా ఈ మరణాలతో సంబంధం ఉన్న ఎస్ఐలలో ఒకరైన పాల్ దొరై కరోనా బారిన పడి మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం కన్నుమూశారు. అయితే సరైన చికిత్స అందించక పోవడం వలనే పాల్ దొరై చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ లాకప్ డెత్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. విపక్ష డిఎంకె అయితే అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. రోడ్లపై డిఎంకె ఆధ్వర్యంలో నిరసనలు కూడా జరిగాయి.

First Published:  11 Aug 2020 10:10 PM GMT
Next Story