Telugu Global
National

ఏపీలో తగ్గిన నేరాలు... బాబుకు సమాధానం

ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పదేపదే ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తున్నారు. పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ గణాంకాలతో ఒక ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు హయాంలో జరిగిన నేరాలను, ఈ ఏడాదిలో జరిగిన నేరాలను పోలుస్తూ గణాంకాలతో ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి … ప్రజాసేవలో ముందున్న పోలీసులపై నిందలు వేయడం సరికాదని పోలీసు శాఖ అభిప్రాయపడింది. సుధీర్ఘ […]

ఏపీలో తగ్గిన నేరాలు... బాబుకు సమాధానం
X

ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పదేపదే ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తున్నారు. పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ గణాంకాలతో ఒక ప్రకటన విడుదల చేసింది.

చంద్రబాబు హయాంలో జరిగిన నేరాలను, ఈ ఏడాదిలో జరిగిన నేరాలను పోలుస్తూ గణాంకాలతో ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి … ప్రజాసేవలో ముందున్న పోలీసులపై నిందలు వేయడం సరికాదని పోలీసు శాఖ అభిప్రాయపడింది. సుధీర్ఘ అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలకు ప్రజల్లో కొన్ని అంచనాలు ఉంటాయని వాటికి తగ్గట్టు వ్యవహరించాలని చంద్రబాబుకు పోలీసులు సూచించారు.

2018 ఏప్రిల్‌ 1 నుంచి 2019 మే 31 వరకు అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆఖరి ఏడాదిలో జరిగిన నేరాలను… 2019 జూన్‌ 1 నుంచి 2020 జులై 30 వరకు జరిగిన నేరాలకు సంబంధించిన గణాంకాలను పోలీసులు విడుదల చేశారు. హత్యలు, రేప్‌లు, అల్లర్లు గతంతో పోలిస్తే ఏపీలో తగ్గాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆ వివరాలు పట్టికలో చూడవచ్చు.

First Published:  13 Aug 2020 8:52 AM GMT
Next Story