Telugu Global
National

పట్టాల పంపిణీకి మరో కొత్త ముహూర్తం...

జగన్ నవరత్నాల కార్యక్రమాలలో అన్నింటికంటే అతి ముఖ్యమైనది, పేదలకు అత్యంత ఎక్కువ లబ్ధి చేకూర్చే పథకం ఇళ్ల పట్టాల పంపిణీ. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మహూర్తం నిర్ణయించి మరీ రెవెన్యూ డిపార్ట్ మెంట్ ని ఉరుకులు పరుగులు పెట్టించారు సీఎం జగన్. అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా చుట్టు పక్కల ఊరి ప్రజలకు ఇళ్ల పట్టాలకోసం స్థలాలు కేటాయించారు. జగన్ నిర్ణయంతో పేదలు ఎంత సంతోషించారో, చంద్రబాబు అంతగా బాధపడ్డారు. తమ హయాంలో కట్టిన అపార్ట్ […]

పట్టాల పంపిణీకి మరో కొత్త ముహూర్తం...
X

జగన్ నవరత్నాల కార్యక్రమాలలో అన్నింటికంటే అతి ముఖ్యమైనది, పేదలకు అత్యంత ఎక్కువ లబ్ధి చేకూర్చే పథకం ఇళ్ల పట్టాల పంపిణీ. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మహూర్తం నిర్ణయించి మరీ రెవెన్యూ డిపార్ట్ మెంట్ ని ఉరుకులు పరుగులు పెట్టించారు సీఎం జగన్.

అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా చుట్టు పక్కల ఊరి ప్రజలకు ఇళ్ల పట్టాలకోసం స్థలాలు కేటాయించారు. జగన్ నిర్ణయంతో పేదలు ఎంత సంతోషించారో, చంద్రబాబు అంతగా బాధపడ్డారు. తమ హయాంలో కట్టిన అపార్ట్ మెంట్లను పేదలకు కేటాయించకుండా ఇప్పుడీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏంటని ప్రశ్నించారు.

నిజంగానే చంద్రబాబుకి పేదల పట్ల ప్రేమ ఉంటే ఐదేళ్లలో ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చు కదా, సరిగ్గా ఎన్నికల నాటికి అపార్ట్ మెంట్లు పూర్తి చేసి, రంగులేసి రాజకీయం చేయడం ఎందుకు? ఆ సంగతి పక్కనపెడదాం.. ఇప్పుడు జగన్ ఇస్తానంటున్నవి ఇళ్ల స్థలాలే కదా, అలాంటప్పుడు అపార్ట్ మెంట్లు నిరుపయోగం అయ్యే ప్రశ్నే ఉండదు కదా. కానీ చంద్రబాబు దూరాలోచన వేరే ఉంది.

తొలివిడతలో దాదాపు పాతిక లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తే.. ఐదేళ్లలో జగన్ ఆ సంఖ్యను మరింత పెంచుకుంటూ పోతారు. అంటే స్థలాల వల్ల లబ్ధి పొందిన పేదలెవరూ పొరపాటున కూడా జగన్ ని మర్చిపోరు, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా టీడీపీకి ఓటు వేయరు. అందుకే చంద్రబాబు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు.

పట్టాలు పంపిణీ చేసి వాటిని రిజిస్ట్రేషన్లు చేయడం సరికాదని కోర్టులో కేసులు వేయించారు, అమరావతి ప్రాంతంలో రైతులనుంచి సేకరించిన భూమిని పేదలకు ఎలా పంపిణీ చేస్తారంటూ అక్కడి స్థానికులతో కేసులు వేయించారు. ఆవ భూములని ఓచోట, అసైన్డ్ భూములని మరోచోట.. దాదాపు 100కి పైగా కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి.

ఈ దశలో ఈ ఏడాది ఉగాది (మార్చి25)న మొదలు కావాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ తొలివిడత కరోనా కారణంగా వాయిదా పడింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇస్తామన్నారు, కోర్టు కేసులు తెమలకపోవడంతో అది వైఎస్ జయంతి అయిన జులై 8నకి మారింది. అప్పుడు కూడా కుదర్లేదు, అది కాస్తా ఆగస్ట్ 15కి మారింది. తీరా ఇప్పుడు కూడా కేసులు తెమలకపోవడంతో ప్రభుత్వానికి ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఈ మహూర్తం కూడా క్యాన్సిల్ అయింది. అక్టోబర్ 2న కొత్త మహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు సార్లు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడింది.

First Published:  12 Aug 2020 9:47 PM GMT
Next Story