Telugu Global
National

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలపై హైకోర్టు సంతృప్తి

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఈ నెల 3 నుంచి 42 వేల సెకెండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం వెల్లడించింది. గతంలో 857 ఉన్న ఐసోలేషన్ బెడ్లు ప్రస్తుతం […]

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలపై హైకోర్టు సంతృప్తి
X

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించారు.

ఈ నెల 3 నుంచి 42 వేల సెకెండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం వెల్లడించింది. గతంలో 857 ఉన్న ఐసోలేషన్ బెడ్లు ప్రస్తుతం 2,995కి పెంచినట్లు నివేదికలో చెప్పింది. హైదరాబాద్ కాకుండా జిల్లాల్లో 86 కోవిడ్ కేంద్రాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ రోగులు వస్తే వారిని వెంటనే చేర్చుకునేలా ప్రక్రియను సులభతరం చేసినట్లు హైకోర్టుకు చెప్పారు.

ఇక ఇటీవల కొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై పిర్యాదులు వచ్చాయని.. వాటికి సంబంధించి 46 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, 16 ఆసుపత్రులు వివరణ ఇచ్చాయని కోర్టుకు వెల్లడించారు. ప్రతీరోజు బులిటెన్ విడుదల చేస్తున్నామని.. ప్రతీ నిత్యం యాంటీజెన్ టెస్టులు చేయడం వల్ల ఎంతో ఉపయోగం కలుగుతున్నదని వివరించింది. రాష్ట్రంలో రోజుకు 40 వేల ర్యాపిడ్ టెస్టులు జరిపేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశామని ప్రభుత్వం చెప్పింది.

మరోవైపు కరోనా మృతదేహాల కోసం 61 వాహనాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తగ్గుముఖం పడుతున్నదని పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం కల్పించినట్లు వెల్లడించింది. కరోనా నియంత్రణ కోసం అందరం రాత్రీ పగలు కష్టపడుతున్నట్లు సోమేష్ కుమార్ కోర్టుకు తెలిపారు.

కాగా, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వివరణపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వివరాలను బట్టి చూస్తే ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తున్నట్లు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని విమర్శించాలనే ఉద్దేశం తమకు లేదని.. చిన్న చిన్న లోపాలను సరి దిద్దాలనే మా ప్రయత్నమని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంతో పోల్చకుంటే ప్రభుత్వ చర్యలు 99 శాతం మెరుగయ్యాయని తేల్చి చెప్పింది.

First Published:  13 Aug 2020 3:46 AM GMT
Next Story