మరో ప్రాజెక్ట్ లాక్ చేసిన నాని

ఈ లాక్ డౌన్ టైమ్ లో కూడా తన జోరు తగ్గించలేదు నాని. ఇప్పటికే చేతిలో 2 సినిమాలు ఉండగా.. తాజాగా మూడో సినిమా కూడా ప్రకటించాడు. సో.. వచ్చే ఏడాది మొత్తం నాని ఫుల్ బిజీ అన్నమాట. నాని చేతిలో ఉన్న ఆ 3 సినిమాలేంటో చూద్దాం

ప్రస్తుతం టక్ జగదీశ్ అనే సినిమా చేస్తున్నాడు నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు నేచురల్ స్టార్.

ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ సింగ రాయ్ ప్రాజెక్టును మొదలుపెడతాడు నాని. టాక్సీవాలా మూవీ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ సినిమా రాబోతోంది.

ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు నాని. ఈ మేరకు ఈ సినిమాకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బ్రోచేవారెవరురా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు వివేక్ ఆత్రేయ. నాని కోసం ఓ మంచి కథ రాసుకున్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని.